తెలంగాణ

telangana

ETV Bharat / state

Governer: తమిళనాడు సీఎంకు హైదరాబాద్ మామిడిపండ్ల బహుమతి - తెలంగాణ వార్తలు

గవర్నర్ తమిళిసైని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మర్యాదపూర్వకంగా కలిశారు. చెన్నైలోని స్టాలిన్​ నివాసంలో వీరు భేటీ అయ్యారు. హైదరాబాద్ రాజ్ భవన్​లో పండించిన మామిడి ఫలాలను గవర్నర్ స్టాలిన్​కు అందించారు.

stalin met tamilisai, tamilanadu cm stalin, governor tamilisai soundarsrajan
స్టాలిన్, తమిళిసై భేటీ, గవర్నర్ తమిళిసై, తమిళనాడు సీఎం స్టాలిన్

By

Published : Jun 21, 2021, 7:43 PM IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​ను మర్యాదపూర్వకరంగా కలిశారు. చెన్నైలోని స్టాలిన్​ నివాసంలో ఈ సమావేశం జరిగింది. హైదరాబాద్ రాజ్ భవన్​లో పండించిన మామిడి ఫలాలను స్టాలిన్​కు గవర్నర్ అందించారు.

పుదుచ్చేరి విమానాశ్రయ విస్తరణకు 200 ఎకరాల స్థలాన్ని కేటాయించి సహకరించాలని ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. స్టాలిన్​ను కోరారు. పుదుచ్చేరి విమానాశ్రయంతో తమిళనాడు సరిహద్దు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి టీఆర్ బాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తమిళనాడు సీఎం స్టాలిన్, గవర్నర్ తమిళిసై

ఇదీ చదవండి:KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది

ABOUT THE AUTHOR

...view details