హైదరాబాద్ నగరంలో 20 వేల లీటర్లలోపు మంచినీటిని ప్రజలకు ఉచితంగా అందించేందుకు పనులు వేగవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో మంచి నీటి సరఫరా తీరుతెన్నులు, సివరేజి వ్యవస్థ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పనులు వేగవంతం చేయండి: మంత్రి తలసాని
సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలో మంచి నీటి సరఫరా తీరుతెన్నులు, సివరేజి వ్యవస్థ నిర్వహణపై సంబంధిత అధికారులతో మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలో 20 వేల లీటర్ల లోపు మంచి నీటి సరఫరాను పొందే వినియోగదారులకు బిల్లులు చెల్లించే అవసరం లేకుండా నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
పనులు వేగవంతం చేయండి: మంత్రి తలసాని
వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. జల మండలి GM రమణా రెడ్డి, డిప్యూటీ GM కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. మంచి నీటి సరఫరా, సివరేజి లైన్ల పునర్నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:'వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు, నియంత్రిత సాగు ఉండదు'