తెలంగాణ

telangana

ETV Bharat / state

'దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే మంచి పాలన ఉంది' - KCR

దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో పథకాలు అమలవుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. సికింద్రాబాద్​లోని సుందరయ్య పార్కులో తనయుడు సాయి కిరణ్​ తరఫున మంత్రి ప్రచారం చేశారు.

'దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే మంచి పాలన ఉంది'

By

Published : Mar 31, 2019, 11:21 PM IST

'దేశవ్యాప్తంగా రాష్ట్రంలోనే మంచి పాలన ఉంది'
జంట నగరాల్లో ఉన్న పార్కుల్లో కనీస సౌకర్యాలు కల్పించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే మంచి పాలన కొనసాగుతోందని ఎక్కడలేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. సికింద్రాబాద్​ పార్లమెంట్​ పరిధిలోని సుందరయ్య పార్కులో కుమారుడు తలసాని సాయి కిరణ్​ తరఫున మంత్రి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లోనూ తెరాసనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి తలసానితో పాటు ముషీరాబాద్​ ఎమ్మెల్యే గోపాల్​, రామ్​ నగర్​ కార్పొరేటర్​ శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details