తెరాస భవన్లో కాళేశ్వరం సంబురాలు అంభరాన్ని అంటాయి. తెరాస నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఇంతటి గొప్ప ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదని మంత్రి అన్నారు. స్వరాష్ట్రంలో నీళ్ల కల నేటితో నెరవేరిందని తెలిపారు. వచ్చే 50 ఏళ్ల వరకు హైదరాబాద్, తెలంగాణకు నీటి కష్టాలు ఉండవని ధీమా వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరే అని మంత్రి తలసాని ఉద్ఘాటించారు.
'ప్రాజెక్టు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరే' - project
కాళేశ్వరం ప్రారంభోత్సవ సంబురాలు రాష్ట్రమంతా ఘనంగా జరిగాయి. తెరాస భవన్లో జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని పాల్గొన్నారు.
సంబురాల్లో తెరాస
ఇవీ చూడండి: వైభవంగా... కాళేశ్వర గంగ ఉప్పొంగంగా...!