తెలంగాణ

telangana

ETV Bharat / state

'పిస్తాహౌస్​పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి'

పిస్తా హౌస్ బ్రాండ్​పై నకిలీ వీడియోను వైరల్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ మోషీ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్​కు ఫిర్యాదు చేశారు.

pista house

By

Published : Jul 25, 2019, 10:08 AM IST

పిస్తా హౌస్​ బ్రాండ్​పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ సంస్థ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ మోషీ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్​కు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పిస్తా హౌస్ బేకరిలో పాడైన పదార్థాలు విక్రయిస్తున్నారంటూ వీడియోలను వైరల్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియో పాకిస్థాన్​లోని ట్రీట్ బేకరీ ఆఫ్ పాకిస్థాన్​కు చెందినదని తెలిపారు.​ కావాలనే తమ సంస్థ పై దృష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. ఈ ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు కమిషనర్ బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

'పిస్తాహౌస్​పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి'

ABOUT THE AUTHOR

...view details