తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2020, 8:04 PM IST

ETV Bharat / state

ఈ ఏడాది చివరికల్లా రెండోదశ టీ హబ్‌ : కేటీఆర్‌

రాష్ట్రంలో అంకుర పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంకుర పరిశ్రమలకు ఏ రాష్ట్రం ఇవ్వని ప్రోత్సాహం ఇస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో రెండోదశ టీ హబ్‌ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుంది వెల్లడించారు. కరీంనగర్‌, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ktr
ktr

స్టార్టప్ ఇంక్యుబేటర్.. టీ-హబ్ రెండో దశ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలిస్తూ.. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తూ.. గ్రామీణ యువతకు ఉపాధి అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ సహా.. రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అందులో భాగంగా గ్రామీణ ఆవిష్కర్తలను వెలుగులోకి తీసుకువచ్చే ఇంటింటా ఇన్నోవేటర్, మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు వీ-హబ్ పని చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలతో ఇన్నోవేషన్ భాగస్వామిగా ఒప్పందం చేసుకున్నామని.. రాష్ట్ర నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు టాస్క్​ను ఏర్పాటు చేశామన్నారు. వ్యవసాయంలోనూ సాంకేతికత వినియోగించుకుంటూ.. ఇక్రిసాట్ భాగస్వామ్యంతో ఐ-హబ్ నెలకొల్పామని పేర్కొన్నారు. త్వరలో రైతువేదికలకు ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించి వ్యవసాయ విధానాలపై వారిని మరింత చైతన్యపరుస్తామని మంత్రి ప్రకటించారు.

ఈ ఏడాది చివరికల్లా రెండోదశ టీ హబ్‌ : కేటీఆర్‌

ఇదీ చదవండి:భారత్‌ బయోటెక్‌ కృషి అభినందనీయం : అక్బరుద్దీన్‌

ABOUT THE AUTHOR

...view details