అంకురాల కోసం క్లౌడ్ సర్వీసుల ప్లాట్‌ఫామ్‌ను రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించింది. ఉచిత క్లౌడ్ సర్వీసులతో స్టార్టప్స్ మౌలిక స్వరూపాన్ని మార్చే సత్తా ఉందని హైదరాబాద్‌లోని టీ-హబ్ సీఈఓ రవి నారాయణన్ అన్నారు. ఈ సర్వీసులు అంకురాలకు మంచి ఊతంగా ఉంటాయని తెలిపారు.
మైక్రోసాఫ్ట్‌తో అంబానీ ఒప్పందం
క్లౌడ్ సర్వీసుల కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు రిలయన్స్ వార్షిక సమావేశంలో ముఖేశ్ అంబానీ ప్రకటించారు. అంకురాల నిధుల్లో 80 శాతం ఈ సేవలకే పోతున్నట్లు ప్రసంగంలో ఆయన తెలిపారు.
జియో లానే ఇది హిట్టవుతుంది..
మనం దేశంలో ఉన్న అంకురాల్లో ఎక్కువ భాగం టెక్నాలజీ ఉపయోగించుకునేవే. జియో నెట్వర్క్ ద్వారా ఉచిత క్లౌడ్ సర్వీసులను అందిస్తే జియో లానే దీనిని ప్రజలు ఆదరిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యంత వేగంగా 15 మిలియన్ వినియోగదారులను పొందిన జియో... క్లౌడ్ సర్వీసులను అంకురాలకు అందించడం ద్వారా మరిన్ని వినియోగదారులను పొందే అవకాశముందన్నారు నారాయణన్.
ప్రస్తుతం ఏయే సంస్థలు ఈ సేవలందిస్తున్నాయి..?
ప్రస్తుతం అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎంలు ఇలాంటి సేవలను అందిస్తున్నాయి. ఈ సేవలను కొంత కాలం పాటు రుణం రూపంలో అందుబాటులో ఉంచుతున్నాయి. ఆ తర్వాత ఆ సేవలను ఉపయోగించుకునేందుకు ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
'జియో క్లౌడ్ సర్వీసులతో అంకురాల దశ తిరగనుంది' ఇదీ చదవండిః మగాళ్లతో స్నేహం వద్దంటే తండ్రినే చంపేసింది..!