Swachhata Hi Seva 2023 Telangana : మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు స్వచ్ఛతా హీ సేవా(swachhata hi seva) కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నాయకులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. రాజ్‌భవన్ లోపలి రహదారులను పరిశుభ్రం చేశారు. చుట్టు పక్కల పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నుంచి పరిరక్షించుకోవచ్చని తెలిపారు. నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు.
MP Kishan Reddy Participate in Swachh Bharat : పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని.. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నల్లకుంటలోని శంకర్ మట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానికంగా రోడ్ల వెంట ఉన్న చెత్తను కిషన్ రెడ్డి శుభ్రం చేశారు. జీహెచ్ఎంసీ సిబ్బంది, స్థానిక కార్పొరేటర్ సైతం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. ప్రతి ఒక్కరు తమ పరిసరాలను చెత్తను పరిశుభ్రం చేసుకోవటం ద్వారా స్వచ్ఛ భారత్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Swachh Bharat Mission 2022 : స్వచ్ఛభారత్ మిషన్‌లో ఆదర్శంగా కొత్తగూడెం..
National Statistics Department Staff onSwachh Bharat : ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని జాతీయ గణాంక శాఖకు చెందిన ప్రాంతీయ కార్యాలయంలో స్వచ్చత కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సెలవు రోజైనా.. ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయానికి చేరుకుని స్వచ్చందంగా స్వచ్ఛ భారత్ పనులు చేశారు. కార్యాలయ పరిసరాల్లోని చెత్తను ఏరివేసి పరిశుభ్రత పనులు చేపట్టారు. ఉద్యోగులు, సిబ్బంది వారి వారి కుటుంబసభ్యులతో కలిసి గంటపాటు కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు.