'పృథ్వీరాజ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలి' ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ పృథ్వీరాజ్ వ్యవహారంపై తిరుపతి సీఐటీయూ కార్యాలయంలో... ఆ సంస్థ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. మహిళా ఉద్యోగి పట్ల పృథ్వీరాజ్ అసభ్యంగా మాట్లాడటం దారుణమని ఆగ్రహించింది. ఆయన మాట్లాడిన ఆడియో టేపులను మీడియా ముందుంచింది. ఎస్వీబీసీ ఛాంబర్‌ను తప్పుడు పద్ధతులకు వాడుకున్నారని తమ దృష్టికి వచ్చినట్లు ఉద్యోగుల సంఘం పేర్కొంది. 35 మంది ఉద్యోగులను ఇష్టానుసారం నియమించారని... తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆ ఉద్యోగులను తొలగించారని సంఘం సభ్యులు తెలిపారు.
అధికార దుర్వినియోగం చేశారు
తితిదే అధికారులకు తెలియకుండా పృథ్వీ నియామకాలు చేశారని ఉద్యోగుల సంఘం ఆరోపించింది. అనేక మందిని వేధిస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని.. పృథ్వీ పదవిని అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పృథ్వీరాజ్‌ను కొనసాగిస్తే సంస్థకు అప్రతిష్ఠ వస్తుందని అభిప్రాయపడింది. పృథ్వీరాజ్ పట్ల కఠినంగా వ్యవహరించాలని.. వెంటనే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం కోరింది.
ఇవీ చదవండి. నిరాయుధులపై దాడులు చేయిస్తారా..?'