తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసు సంక్షేమ నిధికి సువెన్​ ఫార్మా రూ.50లక్షలు విరాళం - పోలీసు సంక్షేమ నిధికి సువెన్​ఫార్మా విరాళం

సువెన్​ ఫార్మాసూటికల్స్​ సీఈవో వెంకట్​ జాస్తి రూ.50 లక్షలు పోలీసు సంక్షేమ నిధికి విరాళమిచ్చారు. శనివారం ఈమొత్తాన్ని చెక్కురూపంలో డీజీపీ మహేందర్​ రెడ్డికి అందజేశారు.

Suven Pharma donates for police welfare
పోలీసుల సంక్షేమానికి సువెన్​ ఫార్మా రూ.50లక్షలు విరాళం

By

Published : Apr 5, 2020, 10:26 AM IST

కరోనా కట్టడి చర్యల్లో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల సంక్షేమానికి సువెన్​ ఫార్మా లిమిటెడ్​ విరాళం ప్రకటించింది. రూ.50లక్షలు చెక్కును ఆ సంస్థ ఛైర్మన్​, సీఈవో వెంకట్​ జాస్తి... డీజీపీ మహేందర్​ రెడ్డికి అందజేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పోలీసు శాఖ సేవలను ఆయన ప్రశంసించారు.

విధుల్లో ఉన్న సిబ్బంది కోసం అవసరమైన పరికరాలు అందించాలని ఆయన కోరారు. నిత్యావసరాలు, మందులు తదితర రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీసుల కృషిని అభినందించారు.

ఇదీ చూడండి:రాష్ట్రంలోని 23 జిల్లాలకు వ్యాపించిన వైరస్‌

ABOUT THE AUTHOR

...view details