హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పూజాఅంబిక అనే యువతి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఏడుకొండలు, శమంతకమణి దంపతులకు పూజాఅంబిక, ఒక కొడుకు ఉన్నారు. స్థానికంగా వీరు చందానగర్ రాజీవ్ స్వగృహలో నివాసం ఉంటున్నారు.
అంబిక బీటెక్ కంప్యూటర్స్ చదువుతూనే మోతీలాల్ ఓస్వాల్ అనే ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. అయితే ఈ రోజు ఉదయం ఐదుగంటల సమయంలో పూజా బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.