చంచల్గూడకు సూర్యతేజ - suryateja
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో అమె ప్రియుడు సూర్యతేజను పోలీసులు రిమాండ్కు తరలించారు.
ఝాన్సీ ప్రియుడు సూర్య తేజ రిమాండ్కు తరలింపు
ఇటీవల సూర్యతేజ ఝాన్సీని దూరం పెట్టడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తరుచూ అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తుండటం వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలు తరలించారు.