తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పిద్దాం: జస్టిస్​ ఎన్వీ రమణ - న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పిద్దాం: జస్టీస్​ ఎన్వీరమణ

సికింద్రాబాద్​లో సిటీ సివిల్‌ కోర్టు భవనాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ప్రజలకు ఇక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగించేలా కోర్టు వాతావరణం ఉండాలని సూచించారు.

న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పిద్దాం: జస్టిస్​ ఎన్వీ రమణ

By

Published : Jul 28, 2019, 1:46 PM IST

Updated : Jul 28, 2019, 3:11 PM IST

ప్రజలకు న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పించేలా కోర్డులో పని వాతావరణం ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ సూచించారు. సికింద్రాబాద్​లో సిటీ సివిల్​ కోర్టు భవనాలను ప్రారంభించిన ఆయన... సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల ఛాంబర్ల కంటే ఇక్కడి ఛాంబర్లు బాగున్నాయని కొనియాడారు. సమాజంలో ఏ వృత్తికి లేని గౌరవం అడ్వకేట్లకు ఉందన్నారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నప్పుడే విచారణ సులభమవుతుందని జస్టిస్‌ ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్​ సుభాష్​రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రాఘవేంద్ర సింగ్​ చౌహాన్​, జస్టిస్​ పీవీ సంజయ్​ కుమార్​లు పాల్గొన్నారు.

న్యాయం జరుగుతుందన్న భరోసా కల్పిద్దాం: జస్టీస్​ ఎన్వీరమణ
Last Updated : Jul 28, 2019, 3:11 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details