తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఎంసీ కార్యకలాపాలపై సుప్రీం విచారణ.. గ్రీన్‌ బెంచ్‌కు బదిలీ - supreme latest news

SC ON OMC CASE: ఆంధ్రప్రదేశ్​లోని ఓబులాపురం మైనింగ్​ కార్యకలాపాలపై దాఖలైన పిటిషన్లను గ్రీన్​ బెంచ్​కు సుప్రీం కోర్టు బదిలీ చేసింది. సరిహద్దు వివాదంతో సంబంధం లేదని ఓఎంసీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు.

Supreme inquiry into OMC activities
ఓఎంసీ కార్యకలాపాలపై సుప్రీం విచారణ

By

Published : Jan 10, 2023, 5:41 PM IST

SC ON OMC CASE:ఆంధ్రప్రదేశ్​లోనిఓబులాపురం మైనింగ్​ కార్యకలాపాలపై దాఖలైన పిటిషన్లను గ్రీన్‌ బెంచ్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. మైనింగ్ కొనసాగింపుపై సుప్రీంకోర్టు గ్రీన్‌ బెంచ్‌ విచారణ చేయనుంది. ఓఎంసీ తవ్వకాల్లో హద్దులు చెరిపిన అంశం పరిగణనలోకి తీసుకోవాలంది. భూగర్భ తవ్వకాలు ఎక్కడి వరకు వెళ్తాయో చెప్పలేమంటూ.. ఆస్ట్రేలియా భూగర్భ మైనింగ్‌ వ్యవహారాన్ని ప్రస్తావించింది.

మైనింగ్‌ కొనసాగింపునకు ఏపీ అంగీకారం తెలిపితే సరిపోదని, కర్ణాటక అనుమతి అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరిహద్దు వివాదంతో సంబంధం లేదని ఓఎంసీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ప్రస్తుతం ఏపీలోనే మైనింగ్‌ జరుగుతోందని.. కర్ణాటకలో అభ్యంతరాలేమీ లేవని అన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కర్ణాటకలో మైనింగ్ మొత్తం పూర్తయిందా అని ప్రశ్నించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details