తెలంగాణ

telangana

ETV Bharat / state

తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంలో ఊరట.. నోటీసులపై 'స్టే'

గొట్టిపాటి గ్రానైట్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసు(MLA gottipati ravikumar show cause notices case news)పై స్టే విధించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

Supreme court on TDP MLA
Supreme court on TDP MLA

By

Published : Oct 25, 2021, 7:42 PM IST

తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసు(MLA gottipati ravikumar show cause notices case news)పై స్టే విధించింది(supreme court gives stay on MLA gottipati ravikumar case news). ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ..

గొట్టిపాటికి చెందిన గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ మేరకు రూ.50 కోట్లు జరిమానా విధిస్తూ ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఈ నోటీసులపై గొట్టిపాటి ఆరాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్ జడ్జి బెంచ్ నోటీసులను కొట్టివేసింది.ఈ నిర్ణయంపై ప్రభుత్వం డివిజన్ బెంచ్​కు వెళ్లింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. సుప్రీంను ఆశ్రయించారు. కంపెనీలో అవకతవకలపై విజిలెన్స్ సిఫారసు చట్ట విరుద్ధమని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదీ చూడండి:Revanth Reddy on Trs Plenary: 'తెలుగుతల్లిని దూషించిన కేసీఆర్... ప్లీనరీలో విగ్రహం పెట్టుకున్నడు'

ABOUT THE AUTHOR

...view details