రాష్ట్ర రాజధానిలో షాపింగ్ మాల్స్‌లో క్రయవిక్రయాలు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందే. ఇక మధ్యతరగతి, నిరుపేదలు వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాలంటే కష్టమే. అందుకే రాష్ట్ర రాజధాని మధ్యలో సరిగ్గా 15యేళ్ల క్రితం ఆదివారం సంత వెలసింది. ఈ సంతలో నిరుపేదలకు అవసరమైన అన్ని కుటుంబ అవసరాలకు సంబంధించిన వస్తులు కొనుగోలు చేయవచ్చు. గృహోపకరణాలు, వంట సామాగ్రి, కత్తులు, కత్తిపీటలు, ప్లాస్టిక్ సామాన్లు, గోడగడియారాలు, వాచ్‌లు, కుర్చీలు, టేబుళ్లు, ఫిట్ నెస్‌కు సంబంధించిన వస్తులు, సౌందర్య సాధనాలు ఇలా అన్ని వస్తువులు ఒకేచోట దర్శనమిస్తాయి.
చౌక ధరలో ఎలక్ట్రానిక్ పరికరాలు
ఈరోజుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చవుతుంది. అదే ఆదివారం సంతకు వెళ్తే అత్యంత తక్కువ ధరలో లభిస్తాయి. పిల్లలకు సంబంధించిన సైకిళ్లు, పెద్దవాళ్లు వినియోగించే సైకిళ్లు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి. వేసుకునే బట్టలు 50 నుంచి 100రూపాయల లోపే ఇక్కడ దొరుకుతాయి. 2012లో సుమారు 20 మంది వర్తకులు ఎర్రగడ్డలో వ్యాపారం ప్రారంభించామని చెబుతున్నారు. ఇప్పుడు రెండు కిలోమీటర్ల వరకు ఆదివారం సంత విస్తరించింది. ఆదివారం వస్తే చాలు...ఇక్కడ హడావుడి అంతా ఇంతా కాదు..క్రయ విక్రయాలతో ..కొనుగోలు, అమ్మకందారులతో సంత కిటకిటలాడిపోతుంది.
తక్కువ ధరకే పెంపుడు జంతువులు