శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని (arasavalli Suryanarayana Swamy Temple)సూర్య కిరణాలు మళ్లీ ఈరోజు ఉదయం తాకాయి. ఉదయం ఏడు నిమిషాలు, శుక్రవారం రోజు 9 నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్‌ను స్పృశించాయి. ఆ అద్భుత దృశ్యాలను చూసి భక్తులు పులకించిపోయారు.
ప్రతి ఏటా మార్చి 9, 10 తేదీల్లో స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ ఆలయంలో ఆనవాయితీ. మళ్లీ అక్టోబర్ 1,2 తేదీల్లోనూ ఈ అపురూప దృశ్యం సాక్షాత్కారం అవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం మార్పుల్లో చోటుచేసుకునే ఈ అద్భుతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు.
కనులారా వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున బారులుదీరారు. ఇతర రాష్ట్రాల నుంచి సైతం తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆనందంగా ఉంది