హైదరాబాద్ పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రదేశ్ తెదేపా ఎంపీ సుజనా గ్రూప్ కార్యాలయంతో పాటు.. శ్రీనగర్‌లోని సుజనా నివాసంలో సీబీఐ అధికారుల సోదాలు ముగిశాయి. కార్యాలయంలోని పలు పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల అనంతరం సుజనాగ్రూప్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. బ్యాంకులకు రుణాలు చెల్లించలేదన్న ఆరోపణలతో దాఖలైన కేసులో.. సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు.. దేశంలోని సుజనా గ్రూపు ఇతర కార్యాలయాల్లోనూ శనివారం ఉదయం నుంచి తనిఖీలు చేశారు.
సుజనా కార్యాలయంలో ముగిసిన సోదాలు - సుజనా
ఆంధ్రప్రదేశ్ తెదేపా ఎంపీ సుజనా గ్రూప్ అధినేత సుజనా చౌదరి కార్యాలయం, నివాసాంలో సీబీఐ సోదాలు ముగిశాయి. అధికారులు పలు పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
సుజనా కార్యాలయంలో ముగిసిన సోదాలు