తమ భూమి వివాదం పరిష్కరించడంలేదని ఇబ్రహీంపట్నంకు చెందిన దంపతలు ఆత్మహత్యాయత్నం చేశారు. పరిష్కారం కోసం 2010 నుంచి ఎదురు చూస్తున్నామని... అయినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల సీఎం క్యాంప్ కార్యాలయం చేరుకుని... కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. నిప్పంటించుకునే క్రమంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి పంజాగుట్ట ఠాణాకు తరలించారు.
ప్రగతిభవన్ ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం - sucide attempt
తండ్రినుంచి సంక్రమించిన భూమిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నంకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రగతిభవన్ ముందు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు.
దంపతుల ఆత్మహత్యాయత్నం