రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యను గిరిజన సంక్షేమ శాఖలో విజయవంతంగా అమలు చేస్తున్నామని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగులకు నిర్వహించిన ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ పూర్తయిన నేపథ్యంలో శిక్షకులకు హైదరాబాద్‌లో సన్మానం చేసి, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను మంత్రి అందించారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, గిరిజన గురుకులాల ఉప కార్యదర్శి నవీన్ నికోలస్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు జాతీయ స్థాయిలోని వివిధ పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ చూపెట్టి గిరిజన శాఖను దేశంలో తలమానికంగా తయారు చేశామని మంత్రి అన్నారు.