Protests at Harish Rao's House: హైదరాబాద్ కోకాపేటలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇంటిని వైద్య విద్యార్థులు ముట్టడించారు. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్‌లో తమకు సీట్లు వచ్చినా... మెడికల్ కౌన్సిల్ తనిఖీలతో కళాశాల అనుమతి రద్దు చేయడంతో రోడ్డున పడ్డామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రిని కలిసిన 79 మంది విద్యార్థులు... తమను రీ లొకేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ఎంసీ ఆదేశాలు జారీచేసినా కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
మంత్రి హరీశ్‌రావు ఇంటి ముట్టడి.. తమను రీలొకేట్ చేయాలని డిమాండ్ - students protests at minister harish rao house news
12:07 June 09
కోకాపేటలో మంత్రి హరీశ్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థులు
ఈ ఏడాది ఎక్కడ వృథా అవుతుందోనని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని హరీశ్ రావు వద్ద కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి హరీశ్‌రావు.. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:TSRTC Charges: మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుంచే అమలు
'రూ.10 కోసం అమ్మ పడిన కష్టం చూశా.. అందుకే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నా...'
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. మరో 7,240 మందికి వైరస్