పాశ్చాత్య సాంస్కృతిని విడనాడి... మన సంస్కృతి, సంప్రదాయాలపై దృష్టి సారించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ కోఠి లోని ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ, పీజీ కాలేజ్‌లో యాంటీ ర్యాగింగ్‌పై నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మన సంస్కృతిని మరిచి పోయి మదర్స్, ఫాదర్స్, లవర్స్‌డే అంటూ యువతి, యువకులు పెడదారిన పడుతున్నారని మండిపడ్డారు. దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజా సింగ్ తదితరులు పాల్గొన్నారు.
'నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలి' - లక్ష్మణ్
హైదరాబాద్ కోఠిలోని ఓ కళాశాలలో యాంటీ ర్యాగింగ్‌పై నిర్వహించిన కౌన్సెలింగ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలని కోరారు.
'విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం పాటుపడాలి'