ఇంటర్ విద్యార్థుల బలవన్మరణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని పలు విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పీడీఎస్‌యూ, డీవైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్లోబరీనా సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్థుల అరెస్ట్ - students arrest
ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగుతున్నారు. ఫలితాల వైఫల్యానికి కారణమైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని భర్తరఫ్ చేయాలని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి విద్యార్థి, యువజన సంఘాలు ర్యాలీ నిర్వహించారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్థుల అరెస్టు