హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద కేజీబీవీ వర్కర్స్, నాన్ టీచింగ్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. పాఠశాలలో కార్మికులు, బోధనేతర సిబ్బందితో అత్యధికంగా పని చేయించుకొని అతి తక్కువ జీతాలు చెల్లిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోతే సమ్మె చేస్తామని ఆమె హెచ్చరించారు. సీఎం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవటం విచారకరమని కేజీబీవీ ప్రతినిధి విమల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరాపార్క్ వద్ద కేజీబీవీ ఉద్యోగుల సమ్మె
కేజీబీవీ కార్మికుల, బోధనేతర సిబ్బంది జీతాలు పెంచాలని ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. తమ పట్ల వ్యవహరిస్తున్న వివక్షను విడనాడాలని కోరారు.
ఇందిరాపార్క్ వద్ద కేజీబీవీ ఉద్యోగుల సమ్మె