తెలంగాణ

telangana

ETV Bharat / state

' ధ్యానంతోనే... ఒత్తిడికి ఉపశమనం' - నల్లకుంటలో ఉచిత ధ్యాన శిక్షణ

ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలన్నా, మనస్సు ప్రశాంతంగా ఉండాలన్నా ధ్యానమే పరిష్కారం. హైదరాబాద్​ నల్లకుంటలోని శంకరమఠంలో రామచంద్ర మిషన్, హార్ట్​ఫుల్​నెస్​ సంస్థ ఆధ్వర్యంలో ధ్యానోత్సవం నిర్వహించారు.

stress will be relieved by meditation
' ధ్యానంతోనే... ఒత్తిడికి ఉపశమనం'

By

Published : Jan 20, 2020, 8:45 AM IST

తీరిక లేని జీవన శైలిలో కాస్త సమయం ధ్యానానికి కేటాయిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, మనసును ప్రశాంతంగా ఉంచుకోగలమని రామచంద్ర మిషన్​ కో ఆర్డినేటర్​ ఎన్వీ కృష్ణారావు అన్నారు. హైదరాబాద్​ నల్లకుంటలో మూడ్రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు.

హార్ట్​ఫుల్​నెస్​ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో దీర్ఘమైన, లోతైన ధ్యానంలోకి దాదాపు సమాధి స్థితిలోకి వెళ్లవచ్చని కృష్ణారావు తెలిపారు. నిర్మూళీకరణ పద్ధతి ద్వారా ధ్యానం చేసే సమయంలో మనల్ని ఆటంకపరిచే అనేక ఆలోచమల నుంచి విముక్తి పొందవచ్చని వెల్లడించారు.

' ధ్యానంతోనే... ఒత్తిడికి ఉపశమనం'

ABOUT THE AUTHOR

...view details