తెలంగాణ

telangana

ETV Bharat / state

VIJAYAWADA BOOK FAIR: విజయవాడలో పుస్తక మహోత్సవం.. కొలువుదీరిన లక్షలాది పుస్తకాలు - విజయవాడ 32వ పుస్తక మహోత్సవం

Vijayawada Book Festival: విజయవాడ వాసులను పుస్తకాలు పిలుస్తున్నాయి. సుమారు రెండేళ్ల తర్వాత పుస్తక మహోత్సవం మొదలైంది. తొలిరోజే సాహితీ ప్రియులు తమకు కావాల్సిన పుస్తకాల కోసం అన్వేషించారు. విజయవాడ 32వ పుస్తక మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు.

vijayawada book fair
vijayawada book fair

By

Published : Jan 2, 2022, 6:09 AM IST

విజయవాడలో పుస్తక మహోత్సవం.. కొలువుదీరిన లక్షలాది పుస్తకాలు

Vijayawada Book Festival : గతేడాది కొవిడ్ కారణంగా రద్దైన విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఈసారి పకడ్బందీ ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నారు. స్వరాజ్య మైదానంలో లక్షల సంఖ్యలో పుస్తకాలు కొలువుదీరాయి. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలన్నీ తరలివచ్చి.. సుమారు 200 స్టాళ్లలో పుస్తకాలను ఏర్పాటు చేశాయి. ఈ నెల 11 వరకూ జరిగే 32వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని ఆ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వెబినార్‌ ద్వారా ప్రారంభించారు. తన వంతు సాయంగా ఉత్సవాలకు రూ. 5లక్షలు అందించారు. చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని పిల్లలకు అలవాటు చేయాలని గవర్నర్‌ సూచించారు.

32nd book festival: "పుస్తకం ఒక మంచి మిత్రుడు వంటింది. అది పాఠకుడి నుంచి తిరిగి ఏదీ ఆశించదు. పుస్తకం పాఠకుడితో ఎప్పుడూ వాదించదు. పుస్తకాలు మన జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. నేనొక రచయిత, పుస్తకప్రియుడిగా.. చిన్న వయసు నుంచే పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటు చేయాల్సిందిగా తల్లిదండ్రులకు కోరుతున్నా" - బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఏపీ గవర్నర్‌

ప్రముఖ తెలుగు, ఆంగ్ల, ప్రభుత్వ ముద్రణ, ప్రచురణ సంస్థలు పెద్ద ఎత్తున పుస్తకాలతో ఉత్సవంలో పాల్గొన్నాయి. పేదరిక నిర్మూలన సంస్థ, ఎన్నికల సంఘం, గిరిజన సంక్షేమ సంఘం, ఎస్​సీఈఆర్టీ.. తమ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. తొలిరోజే పుస్తక మహోత్సవానికి సాహితీ ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది.

పుస్తకాలు డిజిటల్‌ రూపంలో వస్తున్నా ప్రత్యక్షంగా చదివితేనే ఆ మధురానుభూతిని పొందగలమని సాహితీప్రియులు చెబుతున్నారు. పుస్తక మహోత్సవ ప్రాంగణంలో తొలిరోజు నవోదయ రామ్మోహనరావు, కాళీపట్నం రామారావు సహా పలువురి సంస్మరణ సభలు జరిగాయి. విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.

ఇదీ చూడండి:CDS Chopper Crash: ట్రై సర్వీస్​ విచారణ పూర్తి.. వచ్చే వారమే నివేదిక!

ABOUT THE AUTHOR

...view details