హైదరాబాద్ కొత్తపేటలోని శ్రీమహాప్రత్యంగిరా దేవాలయంలో ప్రజలందరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని యాగం నిర్వహించారు. సిద్దేశ్వర నంద భారతి జగద్గురు ఆదేశానుసారం చేసినట్లు ఆలయ కార్యదర్శి ఎమ్.శ్రీనివాస్ పేర్కొన్నారు.
'కరోనా ప్రబలకుండా ఉండాలని యాగం' - కరోనా వైరస్ నిర్మూలన కొరకు యాగం
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన జరగాలని కోరుతూ హైదరాబాద్ కొత్తపేటలో యాగం నిర్వహించారు. సిద్దేశ్వరనంద భారతి జగద్గురు ఆదేశానుసారం ప్రజలందరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని యాగం నిర్వహించినట్లు ఆలయ కార్యదర్శి శ్రీనివాస్ వెల్లడించారు.
'కరోనా ప్రజలకు రాకుండా ఉండాలని యాగం'
ఈ యాగం ద్వారా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నిర్మూలన జరగాలన్నారు. వ్యాధి ఎక్కువగా ప్రబలకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకున్నామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఆలయ ప్రధాన పూజారి నందిగామ నాగరాజు శర్మ తెలిపారు.
ఇదీ చూడండి :కరోనా ఎఫెక్ట్: ఇకపై మూడురోజులే హైకోర్టు