తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం: శ్రీనివాస్​గౌడ్​ - Minister Srinivas Goud latest news

దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్ర నెట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి తన నివాసంలో అభినందించారు.

Minister Srinivas Goud
Minister Srinivas Goud

By

Published : Apr 10, 2021, 4:24 PM IST

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర నెట్​బాల్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మహబూబ్‌నగర్‌కు చెందిన విక్రమ్‌ ఆదిత్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ ఖాజాఖాన్‌తో పాటు ఉపాధ్యక్షుడు సదత్‌ ఖాన్‌, మనోజ్‌కుమార్‌ తదితరులు మంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర నెట్‌బాల్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ సభ్యులను మంత్రి అభినందించారు.

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని నియమించినట్లు మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. క్రీడాకారులకు, కోచ్​లకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రంలో పెద్దపీఠ వేయబోతున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి జల్లులు

ABOUT THE AUTHOR

...view details