ఆహార భద్రత-నాణ్యమైన ఆహారం నినాదంతో సహజసిద్ధంగా ఉద్యాన పంటల సాగును రైతుల్లో ప్రోత్సహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శిక్షణ సంస్థలో సుగంధ ద్రవ్యాల పంటల సాగు ప్రోత్సాహంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పీ ఛైర్మన్ రాంకుమార్, సమన్వయకర్త ఫిలిప్ కురువిలా, స్పైస్ బోర్డు సంచాలకులు డాక్టర్ లింగప్ప తదితరులు పాల్గొన్నారు. సుగంధ పంటల రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రాసెసింగ్, కంపెనీల ప్రతినిధులు, ఎగుమతిదారులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
'సేంద్రియ పద్ధతుల్లో పంటలను పండించాలి' - 'సేంద్రియ పద్ధతుల్లో పంటలను పండించాలి'
హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శిక్షణ సంస్థలో సుగంధ ద్రవ్యాల పంటల సాగు ప్రోత్సాహంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
'సేంద్రియ పద్ధతుల్లో పంటలను పండించాలి'
రాష్ట్రంలో సుగంధ ద్రవ్యాల పంటల సాగు, విస్తీర్ణం, అదనపు విలువ జోడింపు ఉత్పత్తుల తయారీ, నిల్వ, ప్రాసెసింగ్, ఎగుమతులపై నిపుణులు చర్చించారు. ప్రపంచంలో సుగంధ ద్రవ్యాల సాగు, వినియోగం, ఎగుమతులకు సంబంధించి భారత్ అగ్రస్థానంలో ఉన్న దృష్ట్యా... ప్రత్యేకించి పసుపు, మిరప ఎగుమతులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సంచాలకులు వెంకటరామిరెడ్డి అన్నారు.
ఇవీ చూడండి: 'తాగునీటి పథకాలకు స్థానిక వనరులపైనే ఆధారపడండి'