Irrigation: యాసంగి సీజన్లో రాష్ట్రంలో నూనెగింజలతో పాటు కూరగాయల సాగు కొంత మేర పెరిగినట్లు నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఇదే సమయంలో వరిసాగు ఆశించిన మేర తగ్గలేదని కూడా అంటోంది. రాష్ట్ర స్థాయి సమగ్ర సాగునీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. నీటిపారుదల శాఖ ఓ ఈఎన్సీలు మురళీధర్, నాగేందర్ రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో సీఈలు, ఇంజినీర్లు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పంటలసాగు, పరిస్థితులపై చర్చించారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ తదితర ఉమ్మడి జిల్లాల్లో వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, తదితర పంటలసాగు పెరిగినట్లు ఇంజినీర్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కూరగాయల సాగు కూడా పెరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో వరిసాగే అధికం.. కొంతపెరిగిన నూనెగింజలు, కూరగాయల సాగు - telangana news
Irrigation: యాసంగిలో నూనెగింజలతోపాటు కూరగాయల సాగు కొంత పెరిగినట్లు నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఇదే సమయంలో వరిసాగు ఆశించిన మేర తగ్గలేదని భావిస్తోంది. రాష్ట్రస్థాయి సమగ్ర సాగునీటి ప్రణాళిక నిర్వహణ కమిటీ సమావేశం హైదరాబాద్ జలసౌధలో జరిగింది. ఈ సమావేశంలో సీఈలు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలో పంటల సాగు, పరిస్థితులపై చర్చించారు.
అయితే వరిసాగుకు సంబంధించి మొదట అంచనా వేసినంత తక్కువగా జరగడం లేదని ఇంజనీర్లు తెలిపారు. కొన్ని చోట్ల వరిసాగు ఎక్కువగానే ఉందని చెప్పారు. ఆయకట్టు ఎక్కువగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీరామసాగర్ తదితర ప్రాజెక్టుల కింద ఎక్కువ మొత్తం వరిపంటనే సాగు చేసినట్లు ఇంజనీర్లు వివరించారు. పంటలసాగును దృష్టిలో ఉంచుకొని యాసంగి సీజన్ సాగునీటి అవసరాలపై సమావేశంలో చర్చించారు. 36 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటుందని గతంలోనే నిర్ణయించారు. తాజాగా పంటల సాగు ఆధారంగా 36 నుంచి 40 లక్షల ఎకరాల మధ్య ఉండవచ్చని భావిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల నాట్లు కొనసాగుతున్నందున పూర్తి స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు బాగానే ఉందని.. పంటలకు నీరిచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని నీటిపారుదలశాఖ వర్గాలు చెప్తున్నాయి. సమర్థ నీటియాజమాన్య పద్ధతులను పాటించాలని ఇంజినీర్లకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: