తెలంగాణ

telangana

ETV Bharat / state

నవభారత నిర్మాతల్లో పీవీ నరసింహారావు పాత్ర ప్రత్యేకం: జస్టిస్​ చంద్రయ్య - pv narasimha rao 100th birthday celabration

హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్డులోని పీవీ ఘాట్​ వద్ద రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ ఛైర్మన్​ జస్టిస్​ చంద్రయ్య నివాళులర్పించారు. పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించటాన్ని అభినందిచారు. ప్రధానమంత్రిగా పీవీ చేసిన సేవలను కొనియాడారు.

state-human-rights-commission-chairmen-paid-tributes-tp-pv-narasimha-rao
నవభారత నిర్మాతల్లో పీవీ నరసింహారావు పాత్ర ప్రత్యేకం: జస్టిస్​ చంద్రయ్య

By

Published : Jul 3, 2020, 6:38 PM IST

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా... హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద ఆయన చిత్ర పటానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి దేశానికి ప్రధానిగా ఎదిగిన పీవీ... తెలుగువాడైనందుకు గర్వంగా ఉందని జస్టిస్ చంద్రయ్య తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన నవభారత నిర్మాతల్లో ఒకరిగా నిలిచారని ప్రశంసించారు. ప్రధాన మంత్రిగా పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు... దేశాన్ని ప్రగతి పథంలో నడిపాయని జస్టిస్​ చంద్రయ్య పేర్కొన్నారు.

ఇవీ చూడండి:రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు

ABOUT THE AUTHOR

...view details