హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మొదటగా గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కేసీఆర్... తదుపరి పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నాలుగేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని... సంక్షేమ పథకాల అమలును వివరించారు. ఈ రోజు తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకావిష్కరణ చేసిన కేసీఆర్ - సీఎం కేసీఆర్
రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్... అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జాతీయ పతాకావిష్కరణ