రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద నమోదై.. గుర్తింపు లేని ఏడు పార్టీలకు పురపాలిక ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి గుర్తులు కేటాయించారు. ఆయా పార్టీల బీఫారాలపై పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు వర్తిస్తాయి.
పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీలకు గుర్తుల కేటాయింపు..
గుర్తింపులేని కొన్ని రాజకీయపార్టీలకు పురపాలక ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తులు కేటాయించింది. పురపాలక చట్టంలోని నిబంధనలకు లోబడి ఆయా పార్టీలకు గుర్తులు కేటాయించింది.
తెలంగాణ జనసమితి పార్టీకి అగ్గిపెట్టె గుర్తును కేటాయించారు. జనశంఖారావం పార్టీకి బ్యాట్ గుర్తు, బి.సి.యునైటెడ్ ఫ్రంట్‌కు బ్యాటరీటార్చ్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. మన తెలంగాణ రాష్ట్ర సమాక్య పార్టీకి విజిల్ గుర్తును కేటాయించగా... ప్రజాసేన పార్టీకి కప్పు సాసర్ గుర్తు ఇచ్చారు. సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కత్తెర గుర్తు, యువ తెలంగాణ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదీ చూడండి: యావత్ దేశానికే ఆదర్శంగా మున్సిపాలిటీ చట్టం