జీహెచ్‌ఎంసీ పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కార్యాలయం నుంచే అధికారులు వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 2,272 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. సున్నిత, అతి సున్నిత ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించారు. కొన్ని చోట్ల వీడియో రికార్డింగ్ కూడా చేయిస్తున్నారు. ఓటరు గుర్తింపు కోసం డివిజన్‌కు ఒకటి చొప్పున 150 పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఎస్‌ఈసీ - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 లేటెస్ట్ న్యూస్
బల్దియా పోలింగ్‌ను ఎస్‌ఈసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కార్యాలయం నుంచే వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తోంది. సున్నిత, అతిసున్నిత ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ఎస్‌ఈసీ
మొబైల్ యాప్ ద్వారా ఫేసియల్ రికగ్నైజేషన్ విధానంలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. కరోనావేళ భౌతికదూరాన్ని పాటించేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు.