తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామ స్థాయిలో విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి'

బేగంపేటలోని హరితప్లాజాలో కొత్తగా ఎన్నికైన జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్మన్లతో రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్​ రాజేశం గౌడ్ సమావేశం ఏర్పాటు చేశారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం సమావేశం

By

Published : Jul 17, 2019, 9:17 PM IST

మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామ పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడు రాజేశం గౌడ్‌ అన్నారు. కొత్తగా ఎన్నికైన జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్మన్లతో ఆయన బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ ప్రసాద్‌, పంచాయతీరాజ్‌ కార్యదర్శి వికాస్​రాజ్, ఐఏఎస్‌ అధికారి సురేశ్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఛైర్మన్లు పలు అంశాలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారాల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడతామని అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్లు ప్రజలకు సేవ చేయాలనే ఉత్సహంతో ఉన్నారని... అందుకు తగిన విధంగా గ్రామ స్థాయిలో విద్య, వైద్యంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని రాజేశం గౌడ్‌ అన్నారు. కొత్త బిల్డింగ్‌, వాహనాలకు త్వరలోనే అనుమతులు వస్తాయని కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ తెలిపారు. గ్రామ పంచాయతీలను ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై ముఖ్యమంత్రి ఇప్పటికే పలు మార్లు చర్చించినట్లు కార్యదర్శి వికాస్‌రాజ్‌ తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక సంఘం సమావేశం

ABOUT THE AUTHOR

...view details