ALLEGATIONS ON RAJAMPETA MLA: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తనపై కేసులు పెట్టించి వేధిస్తుండటంతో ఆవేదనతో తన మామ గుండెపోటుతో చనిపోయాడని సుండుపల్లి మండలానికి చెందిన సిద్ధార్థ గౌడ్ ఆరోపించారు. సుండుపల్లి మండలం దిన్నెల గ్రామానికి చెందిన సిద్ధార్థ గౌడ్.. రాష్ట్ర డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగిలో వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు స్వగ్రామమైన దిన్నెలకు వెళ్లివస్తుంటాడు. అందులో భాగంగానే ఇటీవల సుండుపల్లి మండలంలో ఓ జాతీయ నేత విగ్రహం.. మురికి కాల్వల మధ్య పడేసిన వైనాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి వైఖరిని సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించాడు. ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నిస్తూ పలుమార్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. దీంతో సిద్ధార్థ గౌడ్‌పై నందలూరు, రాయచోటి, సుండుపల్లి, రాజంపేట పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.