చెక్‌పోస్టుల వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను నియంత్రిస్తున్న పోలీసులకు తెలంగాణ వైద్యుల సమాఖ్య ఫేస్ ఫీల్డ్‌లను అందజేసింది. నగర పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫేస్ షీల్డ్‌ల పంపిణీ కార్యక్రమంలో సినీ కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు ఎన్.శంకర్, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
పోలీసులకు ఫేస్ షీల్డులు అందించిన విజయ్ దేవరకొండ - corona latest
కరోనా కట్టడి చేయడానికి చెక్‌పోస్టుల వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను నియంత్రిస్తున్న పోలీసులకు తెలంగాణ వైద్యుల సమాఖ్య ఫేస్ షీల్డ్‌లను అందజేసింది. నగర పోలీసు కమిషనర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శంకర్, పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కలిసి పోలీసు సిబ్బందికి షీల్డ్‌లను అందజేశారు.
పోలీసులకు ఫేస్ పీల్డులను అందించిన వైద్యుల సమాఖ్య
వైరస్ వ్యాప్తి నిరోధించడానికి పోలీసులు కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నారని విజయ్ దేవరకొండ అన్నారు. లాక్డౌన్ విజయవంతం కావడంలో పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని, ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని... ఇళ్లలో ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఫేస్ షీల్డ్‌లు విధి నిర్వాహణలో ఉండే పోలీసులకు ఎంతో ఉపయోగపడతాయని సీపీ అంజనీకుమార్ అన్నారు.