తెలంగాణ

telangana

ETV Bharat / state

వరవరరావు విడుదలపై కేసీఆర్, కిషన్​రెడ్డి చొరవ చూపాలి: చాడ - హైదరాబాద్​ తాజా వార్తలు

పౌర హక్కుల నేత వరవరరావును జైలు నుంచి విడుదల చేయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కోరారు. జైలులో కరోనా వ్యాప్తి కారణంగా ఆయన విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

state cpi secretary request to the government
'వరవరరావు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలి'

By

Published : Jul 12, 2020, 3:31 PM IST

పౌర హక్కుల నేత వరవరరావు ఆరోగ్యం దృష్ట్యా కారాగారం నుంచి విడుదల చేసేలా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు.

జైలులో కరోనా విజృంభింస్తున్న కారణంగా... మానవతా దృక్పథంతో... మానవ హక్కుల నేతను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారని... మేధావిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

'వరవరరావు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలి'

ఇదీ చూడండి:పెద్దపల్లిలో లాక్​డౌన్​.. ఎన్ని రోజులో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details