తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్​ బచావో తరహాలో... తెలంగాణ బచావో - రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైన కాంగ్రెస్

మున్సిపల్‌ ఎన్నికలే అజెండాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై నిరసన కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. నేటి నుంచి ఈనెల 27 వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో వరుసగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి... ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. భారత్ బచావో తరహాలో.. రాష్ట్ర కాంగ్రెస్‌ చేపట్టనున్న తెలంగాణ బచావో "ఫ్లాగ్‌మార్చ్‌'' కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

State congress ready to protest
భారత్​ బచావో తరహాలో... తెలంగాణా బచావో

By

Published : Dec 21, 2019, 5:16 AM IST

Updated : Dec 21, 2019, 10:36 AM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, పాలనా వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలకు రాష్ట్ర కాంగ్రెస్ సిద్ధమైంది. దిల్లీలో మోదీ ప్రభుత్వంపై చేపట్టిన భారత్‌ బచావో కార్యక్రమం తరహాలో... తెలంగాణ బచావో కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలని భావిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటు గాంధీభవన్‌లో సన్నాహాక సమావేశాలు నిర్వహించింది.

కార్యకర్తలకు విజ్ఞప్తి..

గురువారం పార్టీ కోర్ కమిటీ సమావేశంకాగా... శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో ప్రత్యేకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. పార్టీ నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నేతలకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

డీసీసీ అధ్యక్షులకు బాధ్యతలు..

కేంద్రంలో మోదీ సర్కార్‌కు, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టే నిరసన కార్యక్రమాల ద్వారా రెండు ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. నిరసన కార్యక్రమాలను రూపకల్పన చేసిన కాంగ్రెస్‌ నాయకత్వం... విజయవంతంగా నిర్వహించే బాధ్యతను ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులకు అప్పగించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా' ఫ్లాగ్​ మార్చ్​'..

నేటి నుంచి 27 వరకు వారం రోజులపాటు చేపట్టే నిరసన, ఆందోళన కార్యక్రమాల్లో రైతుబంధు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి హామీల అమలుపై ఒత్తిడి పెంచి, రాష్ట్రంలో అధికంగా జరుగుతున్న మద్యం అమ్మకాలు, మహిళలపై అఘాయిత్యాలు తదితర అంశాలను ఎండగట్టాలని నిర్ణయించారు. ఈనెల 28న కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని "రాజ్యాంగాన్ని రక్షించండి" అన్న నినాదంతో హైదరాబాద్​లో నిర్వహించనున్న 'ఫ్లాగ్ మార్చ్' కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

భారత్​ బచావో తరహాలో... తెలంగాణ బచావో

ఇవీ చూడండి: 'తెలంగాణ నూటికి నూరు శాతం లౌకిక రాష్ట్రం'

Last Updated : Dec 21, 2019, 10:36 AM IST

ABOUT THE AUTHOR

...view details