తెలంగాణ

telangana

ETV Bharat / state

వారంలో నివేదిక సమర్పించాలి: సీఆర్​సీ - రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​ తాజా వార్తలు

ఆన్​లైన్​ బోధన పేరుతో ఫీజులు వసూలుపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​ స్పందించింది. వారంలో నివేదిక సమర్పించాలని విద్యాశాఖ కమిషనర్​ను ఆదేశించింది. రుసుము అడిగితే tscpcrhyd@gmail.com వెబ్​సైట్​ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని బాలల హక్కుల కమిషన్​ ఛైర్మన్​ శ్రీనివాసరావు తెలిపారు.

వారంలో నివేదిక సమర్పించాలి:సీఆర్​సీ
వారంలో నివేదిక సమర్పించాలి:సీఆర్​సీ

By

Published : May 11, 2020, 8:34 PM IST

ఆన్ లైన్ బోధన పేరుతో ఫీజుల వసూలుపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ స్పందించింది. ఈనాడులో వచ్చిన కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. రుసుము వసూలుపై వారంలో నివేదిక సమర్పించాలని విద్యాశాఖ కమిషనర్​ను ఆదేశించింది. ఫీజులు అడిగితే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్​కు ఫిర్యాదు చేయవచ్చని ఛైర్మన్​ శ్రీనివాసరావు తెలిపారు. వెబ్​సైట్​ tscpcrhyd@gmail.com ద్వారా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details