తెరాస పార్టీలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. డీసీసీబీ ఛైర్మెన్ పదవులు ఎమ్మెల్యే, మంత్రుల కుటుంబ సభ్యులకు ఇచ్చే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.
'బీసీలకు రాజకీయ పదవులు ఇవ్వాలి'
తెరాస పార్టీలో జెండా మోసి పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలకు... రాజకీయ పదవులు ఇవ్వాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి లోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'బీసీలకు రాజకీయ పదవులు ఇవ్వాలి'
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాలో 270 డైరెక్టర్లలో... బీసీలకు 135 డైరెక్టర్ పదవులు, ఐదు డీసీసీబీ ఛైర్మెన్ పదవులు, ఐదు డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులు, పది వైస్ ఛైర్మన్ పదవులు కేటాయించాలని కోరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని 60 శాతం జనాభా ఉన్న బీసీలకు దామాషా పద్ధతిలో పదవులు ఇచ్చి... పార్టీ కోసం కష్టపడిన బడుగు కార్యకర్తలకు అవకాశం కల్పించాలని జాజుల ముఖ్యమంత్రి కోరారు.