తెలంగాణ

telangana

ETV Bharat / state

'గొర్రెల పంపిణీ ద్వారా వేల కోట్ల సంపదను సృష్టించాం' - పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ ‌యాదవ్ తెలిపారు. హైదరాబాద్, మాసబ్​ట్యాంక్​​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

state Animal Husbandry Minister Talsani Srinivas Yadav on gorrela pampini
'గొర్రెల పంపిణీ ద్వారా వేల కోట్ల సంపదను సృష్టించాం'

By

Published : Mar 23, 2021, 12:04 PM IST

గొర్రెల పంపిణీ ద్వారా రూ. 5వేల కోట్లకు పైగా సంపద సృష్టించినట్లు.. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్​ దూరదృష్టితో చేపట్టిన కార్యక్రమం వల్ల.. పల్లెలు ఆర్థికంగా పరిపుష్ఠం అవుతున్నాయన్నారు. హైదరాబాద్, మాసబ్​ట్యాంక్​​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

త్వరలో తెలంగాణ బ్రాండ్ మాంసం విక్రయాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు మంత్రి వివరించారు. విమర్శలు చేసిన విపక్షాలు ఇప్పుడు మాట్లాడాలని కోరారు.

ఇదీ చదవండి:ప్రాథమిక పాఠశాలలకు 5,793 హెచ్‌ఎం కొలువులు

ABOUT THE AUTHOR

...view details