రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బందికే కొవిడ్ టీకాలను అందిస్తుండగా, నిన్నటి నుంచి ప్రభుత్వం.. ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికీ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు.. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్‌లో టీకాల పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా మెడికల్ ఆఫీసర్ స్వరాజ్యలక్ష్మి ప్రారంభించారు.
వ్యాక్సిన్ పంపిణీ నుంచి గర్భిణీలు, బాలింతలను మినహాయించినట్లు స్వరాజ్యలక్ష్మి పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 700 ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా సెంటర్లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 6900మంది హెల్త్ సిబ్బంది ఉండగా.. అందులో 4270మందికి ఇప్పటికే వ్యాక్సిన్ అందినట్లు వెల్లడించారు.