చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో అపశ్రుతి - Andhra Pradesh Latest News
19:32 January 01
చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీలో అపశ్రుతి
ఏపీలోని గుంటూరులో నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు సభ ముగిసి ఆయన వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో నలుగురు అస్వస్థతకు గురవ్వగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 30వేల మందికి ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఆయన కార్యక్రమంలో ప్రసంగించి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా వెనక ఉన్న అందరూ ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. వీరిలో ఒక మహిళ మృతి చెందింది. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరిని గుంటూరు జీజీహెచ్‌కు, మరో ఇద్దరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ గుంటూరు ఏటీ ఆగ్రహారానికి చెందిన గోపిశెట్టి రమాదేవిగా గుర్తించారు.
ఇవీ చదవండి: