తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత జిల్లాలకు బదిలీలు, పోస్టింగులు.. కొత్తగా కేటాయించిన ఉద్యోగులకే అవకాశం! - ఉద్యోగుల బదిలీలు

TS Employees Local cadre 2022 Allotment: రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి కొత్త జోనల్‌ విధానంలో భాగంగా సొంత జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. పనిచేస్తున్న జిల్లాల్లోనే కేటాయింపులు జరిగిన వారికి కాక.. కొత్తగా జిల్లాలు మారిన వారికి కౌన్సెలింగు నిర్వహించి, ఐచ్ఛికాలను స్వీకరించి, సీనియారిటీ ఆధారంగా పోస్టింగులివ్వాలని సూచించింది.

TS Employees Local cadre 2022 Allotment
బదిలీలు, పోస్టింగులు

By

Published : Dec 25, 2021, 7:47 AM IST

TS Employees Local cadre 2022 Allotment: కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల పోస్టింగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టనుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త స్థానికత అనుగుణంగా మరో జిల్లాకు కేటాయింపులు చేసిన వారి కోసం బదిలీలు చేపట్టి పోస్టింగులు ఇవ్వనున్నారు. పనిచేస్తున్న జిల్లాకే కేటాయింపులు అయిన వారు మాత్రం ప్రస్తుత పోస్టింగుల్లోనే కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర జిల్లాలకు కేటాయింపు అయిన వారికి కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టి కొత్త పోస్టింగులు ఇవ్వనున్నారు. కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితా రూపొందించి ఉద్యోగుల నుంచి ఐచ్చికాలను తీసుకోనున్నారు. సీనియారిటీ, ప్రత్యేక కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని కొత్త పోస్టింగులు ఇవ్వనున్నారు.

శుక్రవారం నుంచి 7 రోజుల్లో బదిలీలు పూర్తి చేసి.. ఉత్తర్వులివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త స్థానాల్లో నియమితులైనవారు మూడురోజుల్లో చేరాలంది. పోస్టింగుల కోసం కలెక్టర్‌, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. నియామకాలు, బదిలీలు పారదర్శకంగా సాగాలని, టీజీవో, టీఎన్జీవోలు, గుర్తింపు పొందిన ఇతర ఉద్యోగ సంఘాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించి, ప్రక్రియను పూర్తిచేయాలంది. జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ అనంతరం ఈ శాఖలకు సంబంధించిన జోనల్‌, బహుళ జోనల్‌ పోస్టులకు విడిగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తామంది. జిల్లాలకు సంబంధించి పోలీసు, ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లను బదిలీలు, కొత్త పోస్టింగుల నుంచి మినహాయించింది. శాఖాపరమైన పాలనాపరమైన అవసరాలు, కార్యనిర్వాహక సామర్థ్యం కోసం తదుపరి కార్యాచరణ మార్గదర్శకాలను ఇస్తామంది. జోనల్‌ విధానానికి అనుగుణంగా ఇప్పటికే సొంత జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులంతా కలెక్టర్లు, తమ శాఖల ఉన్నతాధికారుల వద్ద రిపోర్ట్‌ చేశారు. వారందరి నియామకాల కోసం ఉత్తర్వులిచ్చింది.

పోస్టుల భర్తీ ఇలా...

జిల్లా కలెక్టర్లు, శాఖల ఉన్నతాధికారులు కలసి జోనల్‌ కేటాయింపు ప్రక్రియకు ముందు ఆయా జిల్లా(కేడర్‌)ల్లో ఖాళీలు, ఇతర జిల్లాలకు వెళ్లిన వారి స్థానంలో భర్తీ చేయాల్సినవి.. పరిపాలన, కార్యనిర్వాహక అవసరాలను పరిగణించి కొత్తగా ఇవ్వాల్సిన పోస్టుల జాబితాను సిద్ధం చేయాలి. జిల్లా, శాఖ, ప్రాంతం, మండలం, ఖాళీల నమూనాలో ఇది ఉండాలి. మారుమూల, వెనకబడిన ప్రాంతాల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేలా చూడాలి. ఏదైనా జిల్లాలో 50జూనియర్‌ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉండి.. కొత్తగా వచ్చిన 40 మందికి పోస్టింగులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే ప్రాధాన్యక్రమంలో వాటిని గుర్తించి భర్తీ చేయాలి.

ఐచ్ఛికాలు...

జాబితా సిద్ధమయ్యాక.. అన్ని జిల్లాల్లో కౌన్సెలింగు నిర్వహించి, ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలను తీసుకుంటారు. ఉద్యోగిపేరు, పోస్టు, కేటాయించిన జిల్లా, ప్రస్తుత పోస్టు, పనిచేస్తున్న ప్రాంతం, భార్య/భర్త ఉద్యోగి, ప్రత్యేక కేటగిరీ అయితే ఆ ధ్రువీకరణ పత్రాలు. కొత్తగా కోరుకునే మండలం వివరాలు తీసుకొని.. ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు. నియామకాల సందర్భంగా సీనియారిటీతో పాటు ప్రత్యేక కేటగిరీ, భార్యాభర్తల(స్పౌస్‌) అంశాలను పరిగణనలోకి తీసుకొని పోస్టులను కేటాయిస్తారు.

ఇవీ మార్గదర్శకాలు

  • ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు తమ జిల్లాలు మారకపోతే వారిని ఆయా జిల్లాల్లో నియమించినట్లు భావిస్తారు. కొత్త పోస్టింగుల కోసం పరిగణనలోకి తీసుకోరు. ఉదాహరణకు రాజేందర్‌ అనే ఉద్యోగి ఆర్డర్‌ టు సర్వ్‌లో పూర్వ వరంగల్‌ జిల్లా నుంచి మహబూబాబాద్‌కు వెళ్లి అక్కడే పనిచేస్తున్నారు. జోనల్‌ విధానంలో అదే సొంత జిల్లాగా తేలగా.. అక్కడికే కేటాయించారు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నందున కొత్తగా బదిలీ, నియామకం ఉండదు.
  • కొత్త జోనల్‌ విధానంలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా కాకుండా మరో జిల్లా పొందిన వారందరికీ బదిలీలు, నియామకాలుంటాయి. ఉదాహరణకు సత్యనారాయణ ఆర్డర్‌ టు సర్వ్‌లో పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నిర్మల్‌కు వెళ్లి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయనను మంచిర్యాలకు కేటాయించారు. ఆయన ఆ జిల్లాలో వెళ్లి రిపోర్ట్‌ చేశారు. ఆయనకు జిల్లా పరిధిలో కొత్త పోస్టింగు ఇస్తారు.
  • ఇప్పటికే సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల బదలాయింపులు జరిగాయి. వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన వారున్నందున వారందరికీ మళ్లీ ఆ జిల్లా స్థాయిలో సీనియారిటీ జాబితాను రూపొందించి.. జాబితాను ప్రదర్శించాలి.

ఇదీ చూడండి:IPS Transfers in Telangana: రాష్ట్రంలో పెద్దఎత్తున ఐపీఎస్​ల బదిలీ.. హైదరాబాద్​ సీపీగా సీవీ ఆనంద్​

ABOUT THE AUTHOR

...view details