తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana SSC And Inter Supplementary Results : తెలంగాణ పది, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

TS SSC Supplementary Results 2023 : తెలంగాణ పదో తరగతి, ఇంటర్​ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను ఆయా బోర్డులు విడుదల చేశాయి. పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 80.59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో సంవత్సరంలో 46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను www.bsc.telangana.gov.in, www.resuits.bsetelangana.org, https://tsbie.cgg.gov.in తదితర వెబ్​సైట్లలో వీక్షించవచ్చు.

Results
Results

By

Published : Jul 7, 2023, 11:22 AM IST

Updated : Jul 7, 2023, 6:34 PM IST

Telangana SSC Supplementary Results : పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 80.59 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సప్లిమెంటరీ పరీక్షలకు 66 వేల 732 మంది హాజరు కాగా.. వారిలో 53 వేల 777 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 30,528 మంది అబ్బాయిలు ఉండగా.. 23,249 మంది అమ్మాయిలున్నారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను గత నెల 14వ తేదీ నుంచి 22 వరకు జరగగా.. 24వ తేదీ నుంచి 26 వరకు మూల్యాంకనం నిర్వహించారు.

పరీక్ష కేంద్రాలు, మూల్యాంకన కేంద్రాల నుంచి సమాచారం రావల్సి ఉన్నందున.. కొందరు విద్యార్థుల ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉన్నాయని.. వాటిని త్వరలో వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల కార్యాలయం సంచాలకుడు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. రీకౌంటింగ్ కోసం ఈనెల 18 వరకు.. ఈ వెరిఫికేషన్ కోసం ఈనెల 10 నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. రీవెరిఫికేషన్ దరఖాస్తులను డీఈవో కార్యాలయాల్లో సమర్పించాలని.. రీకౌంటింగ్ కోసం ఎస్‌ఎస్‌సీ బోర్డుకు పంపించాలన్నారు.

TS Inter Supplementary Results 2023 : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 63 శాతం, రెండో సంవత్సరంలో 46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత శాతం ప్రథమ సంవత్సరంలో 73శాతానికి.. ద్వితీయ సంవత్సరంలో 78శాతానికి పెరిగింది. సప్లిమెంటరీ పరీక్షల్లో ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు ఒక లక్షా 57,741 మంది.. ఒకేషనల్‌లో 10,319 మంది ఉత్తీర్ణులయ్యారు.

ద్వితీయ సంవత్సరంలో 59,669 మంది జనరల్ విద్యార్థులు... 6,579 మంది ఒకేషనల్ విద్యార్థులు పాసయ్యారు. ఆన్‌లైన్‌ మార్కుల మెమోలు రేపటి నుంచి వెబ్‌సైట్​లో అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం రేపటి నుంచి ఈనెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని బోర్డు పేర్కొంది.

Josa Counseling For Inter Advanced Students : ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనప్పుడు గానీ, ప్రవేశాల సందర్భంలో గానీ మార్కుల షీట్‌ను వారికి సమర్పించాలి. ఇంటర్‌ పరీక్షల సమయంలో అనారోగ్యం, ఇతర కారణాలతో సరిగా పరీక్ష రాయలేక.. తక్కువ మార్కులు సంపాదించిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పిస్తున్నామని సెంట్రల్‌ సీట్‌ అలొకేషన్‌ బోర్డు 2023 ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉమామహేశ్వర్‌ రావు పేర్కొన్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జోసా కౌన్సెలింగ్‌పై వివిధ రాష్ట్రాల ఇంటర్‌ బోర్డు అధికారులతోనూ చర్చిస్తున్నామని చెప్పారు.

పాలిసెట్‌ తేదీల మార్పు : రాష్ట్రంలో 11 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కొత్తగా సీట్లకు, కొత్త కోర్సులకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో నేడు జరగాల్సిన పాలీసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలు మారాయి. ఈ నెల 8,9 తేదీల్లో కొత్తగా స్లాట్‌లు బుక్‌ చేసుకోవచ్చు. 10వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన.. 8 నుంచి 11 వరకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు. వారికి 14వ తేదీన సీట్లు కేటాయిస్తారు. తొలిసారిగా పాలిసెట్‌లో స్లైడింగ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ప్రక్రియ 19,20 తేదీల్లో చేపట్టనున్నారు. ఒక కాలేజీలో సీటు పొందిన అభ్యర్థులు.. మరో కాలేజీలో జాయిన్‌ అవ్వాలనుకుంటే వారికి కూడా ఫీజురియంబర్స్‌మెంట్‌ వర్తిస్తోందని పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ తెలిపారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 7, 2023, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details