Srivari Garuda Seva cancelled in Tirumala: ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడ సేవను తితిదే రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ ఉండదని తితిదే తెలిపింది. నిన్న తిరుమల శ్రీవారిని 61వేల 116 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 18వేలు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.19 కోట్లు వచ్చింది.
రేపు తిరుమలలో గరుడ సేవ రద్దు.. కారణం ఏంటంటే..? - Srivari Purnami Garuda Seva
Srivari Garuda Seva cancelled in Tirumala: ఏపీలోని తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయంలో ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా నిర్వహించే శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీవారి అధ్యయనోత్సవాలు జరుగుతున్నందున గరుడ సేవ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
tirumala