తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండుకుండలా శ్రీశైలం.. సాగర్​కు చేరుతున్న నీళ్లు

కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో... కృష్ణా పరీవాహక ప్రాంతం జలకళను సంతరించుకుంది. జూరాల, ఏపీలోని శ్రీశైలం నిండుకుండలా మారాయి. శ్రీశైలం జలాశయం 12 గేట్లలో 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిండుకుండలా శ్రీశైలం

By

Published : Aug 10, 2019, 7:41 PM IST

శ్రీశైల మనోహర జలదృశ్యం

కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు.. కరవు తీరా వరద వచ్చి చేరుతోంది. ఏపీలోని శ్రీశైలం జలాశయంలో... 4 లక్షల 12 వేల 690 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు... జూరాల నుంచి కూడా భారీ ఎత్తున వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా..... ప్రస్తుతం 204.78 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 883 అడుగుల మేర నీటిమట్టం ఉంది. శ్రీశైలం 10 గేట్లు ఎత్తి.. 3 లక్షల 20 వేల 655 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

కుడి,ఎడమకు నీరు

ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,796 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 28 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇవీ చూడండి: రైల్వే స్టేషన్​లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details