శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. ప్రస్తుతం 3.59 లక్షల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం 879.1 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలుగా ఉండగా... ప్రస్తుతం 183 టీఎంసీలకు చేరుకుంది. డ్యాం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 32,272 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 1,351 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకు 20 వేల క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి కేసీ కెనాల్‌కు 735 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి స్థాయిలో జలాశయం నిండే అవకాశం ఉన్నందున... సాయంత్రం 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నామని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
శ్రీశైలంకు నిలకడగా ప్రవాహం... సాయంత్రం నీటి విడుదల..! - srisailam
శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరటం వల్ల నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. సాయంత్రానికి పూర్తి స్థాయిలో డ్యాం నిండితే... గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు.
శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం