Srinivas goud About Arts : తెలంగాణలో ప్రాచీన కళల పరిరక్షణకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, కళలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 25న రవీంద్రభారతిలో నిర్వహించనున్న సృజనోత్సవ్- 2022 లోగోను హైదరాబాద్‌లోని మంత్రుల సముదాయంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు ఆవిష్కరించారు.
'తెలంగాణలో ప్రాచీన కళల పరిరక్షణకు కృషి చేస్తున్నాం' - తెలంగాణ వార్తలు
Srinivas goud About Arts : ప్రాచీన కళల పరిరక్షణకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నాని పేర్కొన్నారు. స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 25న నిర్వహించనున్న సృజనోత్సవ్ - 2022 లోగోను ఆవిష్కరించారు.
సృజనోత్సవ్ లోగో ఆవిష్కరించిన మంత్రులు
సృజనోత్సవ్ పేరిట విద్యార్థులకు కళల పట్ల అవగాహన కల్పించేందుకు మ్యూజిక్, చిత్రలేఖనంపై పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సాహిస్తున్నందుకు స్వార్ మహతి కళా పరిషత్‌ను మంత్రులు అభినందించారు.
ఇదీ చదవండి :Jaggareddy on resign: 'కాంగ్రెస్‌కు రాజీనామాను వాయిదా వేసుకుంటున్నా'